ఎన్నో విమర్శలు ఉన్న వ్యక్తిని ఎంపీ అభ్యర్థిగా ప్రకటించి తప్పు చేశారు- స్వతంత్ర అభ్యర్థి - independent candit on ysrcp mp - INDEPENDENT CANDIT ON YSRCP MP
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 30, 2024, 5:36 PM IST
Independent Candit Ramana Reddy fires on YSRCP MP Candit : అనంతపురం వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థిగా శంకర నారాయణను ప్రకటించి జగన్ తప్పు చేశారని అనంతపురం పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థి జీవీ రమణారెడ్డి చెప్పారు. అనంతపురంలోని ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో శంకర నారాయణ సొంత పార్టీ కార్యకర్తలపైన కేసులో పెట్టిన చరిత్ర ఉందని రమణారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
వసూళ్లకు అలవాటు పడిన శంకర నారాయణ అంగన్వాడీ ఉద్యోగాలను అమ్ముకున్నారని, రాజకీయ పదవులకు డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. ఈ అక్రమాలపై పత్రికలో రాస్తే ఓ విలేకరి పై దాడి చేయించారని రమణారెడ్డి మండిపడ్డారు. అవినీతి అక్రమాల విషయంలో ప్రజలు చెప్పులు విసిరిన ఘటనలు ఉన్నాయన్నారు. వైఎస్సార్సీపీ అధిష్ఠానం వీటన్నింటిని పరిగణలోకి తీసుకోకుండా శంకర నారాయణను ఎంపీ అభ్యర్థిగా ప్రకటించి తప్పు చేశారన్నారు. శంకర నారాయణను ఓడించడమే లక్ష్యంగా తాను అనంతపురం పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశానని చెప్పారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్న తనను ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. అవినీతి అక్రమాలకు పాల్పడి పార్టీకి చెడ్డ పేరు తీసుకొస్తున్న శంకర నారాయణను ఓడించాలని రమణారెడ్డి పిలుపునిచ్చారు.