ఇంకా సంవత్సరం కాలేదా మంత్రి గారు? విజయవాడలో అసంపూర్ణంగా పార్క్ పనులు - INCOMPLETE MODEL PARK DEVELOPMENT - INCOMPLETE MODEL PARK DEVELOPMENT
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 8, 2024, 12:41 PM IST
Incomplete Model Park Development Work at Vijayawada: విజయవాడ అజిత్ సింగ్ నగర్ పాత డంపింగ్ యార్డు స్థలాన్ని10 కోట్ల రూపాయిలతో మోడల్ పార్కుగా తీర్చుదిద్దుతామని వైఎస్సార్సీపీ ప్రభుత్వం గొప్పలు చెప్పింది. 2020లో అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆర్భాటంగా శంకుస్థాపన చేశారు. పార్క్ నిర్మాణం పూర్తయితే ఎలా ఉంటుందో అప్పట్లో ప్లెక్సీలపై గ్రాఫిక్స్‌తో (Graphics) బొమ్మలు చూపించారని స్థానికులు తెలిపారు. శంకుస్థాపన చేసి నాలుగేళ్లయినా పార్క్ నిర్మాణం పూర్తి కాకపోవటంతో అసాంఘిక కార్యకలాపాలకు పార్క్ స్థలం అడ్డాగా మారిందని స్థానిక మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు.
పార్క్ ప్రారంభించకుండానే వాకింగ్ ట్రాక్ కోసం నిర్మాణం చేసిన గోడలు పడిపోతున్నాయి. నిర్మాణ లోపంతో పార్క్‌లోని విద్యుత్ స్తంభాలు ఒరిగిపోతున్నాయి. పిల్లలు ఆడుకునే ఆట వస్తువులు మూలనపడ్డాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్క్ నిర్మాణ ప్రాంతంపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో చీకటి పడితే పార్క్ స్థలంలో ఆసాంఘిక శక్తులు అడ్డగా మార్చుకుంటున్నాయని స్థానికులు మండిపడుతున్నారు. మోడల్ పార్క్ దుస్థితిపై మరింత సమాచారం ఈటీవీ భారత్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు.