ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

రాష్ట్రంపై అల్పపీడనం ప్రభావం - దక్షిణ కోస్తాకు అతి భారీ వర్ష సూచన - WEATHER UPDATES 2024

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 14, 2024, 3:49 PM IST

AP Weather Updates 2024 : ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. దీంతో ఉత్తర తమిళనాడు, కోస్తా ప్రాంతంలో పయనిస్తోంది. ఈ ప్రభావంతో దక్షిణ కోస్తాలోని కొన్ని జిల్లాలో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో నెల్లూరు, ప్రకాశం జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కృష్ణా, గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

Heavy Rains in AP : దక్షిణ కోస్తాలో 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం వివరించింది. నెల్లూరు, ప్రకాశం జిల్లాలాకు ఆరెంజ్ అలర్ట్,  చిత్తూర్, కడప జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు పేర్కొంది. సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశామని అంటున్న వాతావరణ శాఖ అధికారి కేవీఎస్ శ్రీనివాస్​తో మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యేక ముఖాముఖి.

ABOUT THE AUTHOR

...view details