ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

నాయుడుపేటలో యథేచ్ఛగా గ్రావెల్​ అక్రమ రవాణ - అడ్డుకున్న స్థానికులు - Illegal Transportation Gravel - ILLEGAL TRANSPORTATION GRAVEL

🎬 Watch Now: Feature Video

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 3, 2024, 2:36 PM IST

Illegal Transportation of Gravel in Naidupet : తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం పూడేరు గ్రామంలోని చెరువు నుంచి వైఎస్సార్సీపీ నాయకులు అక్రమంగా గ్రావెల్ తరలిస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న టిప్పర్​ లారీలను స్థానికులు అడ్డుకోగా వారిపై గ్రావెల్​ మాఫియా దాడి చేశారు. దీంతో గ్రామస్థులు భారీగా చేరుకుని వారిపై ఎదురు దాడి చేసి టిప్పర్​ లారీ టైర్లలో గాలి తీసేశారు. ఎటువంటి అనుమతి లేకుండా కొంత కాలంగా గ్రావెల్ తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ విషయంపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్థానికులు వాపోతున్నారు.

పోలీసు, ఇరిగేషన్ శాఖ అధికారులు ఎన్నికల విధుల్లో ఉన్నామని మాట దాట వేస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు పోలీసు అధికారులు పట్టుపడిన వాహనాలపై కేసులు లేకుండా చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. చివరికి స్థానికులు పట్టుపడటంతో టిప్పర్​లను మైనింగ్ అధికారులకు అప్పగిస్తామని పోలీసులు స్టేషన్​కు తీసుకెళ్లారు. చెరువులో గ్రావెల్ అక్రమంగా తరలిస్తుంటే అధికారులు చోద్యం చూస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details