ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

22.24 ఎకరాల చెరువు భూమి కబ్జా - గ్రామస్థుల ఆందోళన - Illegal Registration of Pond Land - ILLEGAL REGISTRATION OF POND LAND

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 30, 2024, 6:12 PM IST

Illegal Registration of Pond Land in Vizianagaram District : విజయనగరం జిల్లా డెంకాడ మండలంలోని ఆనందరాజు చెరువు వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. సర్వే నంబరు 60/3 లో 22.24 ఎకరాల  చెరువు భూమిని అదే గ్రామానికి చెందిన 18 మంది వ్యక్తుల పేరిట భోగాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ జరిగిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  విషయం తెలుసుకున్న రైతులు అక్రమ రిజిస్ట్రేషన్  ఆపాలంటూ ఆందోళన చేపట్టారు. అక్రమ రిజిస్ట్రేషన్ వెనక  వైఎస్సార్సీపీ నేతలు ఉన్నారని రైతులు ఆరోపించారు. అక్రమ వ్యవహారంపై రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

అసలు అక్రంగా చెరువు భూమిని ఎలా రిజిస్ట్రేషన్​ చేయించు కున్నారని గ్రామస్థులు అవాక్కయ్యారు. ఇంత చాకచక్యంగా జరిగిన భూ దోపిడీ వెనక వైఎస్సార్సీపీ నేతల హస్తం ఉందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. అక్రమ రిజిస్ట్రేషన్​కు పాల్పడ్డవారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details