ప్రకాశం బ్యారేజీ గేటు మరమ్మతు పనులకు రంగం సిద్ధం - kannaiah naidu interview - KANNAIAH NAIDU INTERVIEW
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 3, 2024, 1:45 PM IST
Kannaiah Naidu Interview: దెబ్బతిన్న ప్రకాశం బ్యారేజీ గేటు మరమ్మతు పనులకు రంగం సిద్ధం అవుతోంది. అధికారులతో నిపుణుడు కన్నయ్యనాయుడు సమావేశమయ్యారు. దెబ్బతిన్న గేట్లు, కౌంటర్ వెయిట్ ఏర్పాటుపై పలు సూచనలు చేశారు. బ్యారేజీ గేట్లు దెబ్బతినలేదని, ఒక గేటుకు బోటు తగిలిందన్నారు. ప్రకాశం బ్యారేజ్‌కి ఎలాంటి ముప్పు లేదని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణుడు కన్నయ్యనాయుడు తెలిపారు.
కౌంటర్ వెయిట్ బ్రేక్ అయిందని, కొత్త బాక్సులకు డిజైన్ చేశామన్నారు. కౌంటర్ వెయిట్ లేకున్నా గేట్లు దింపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్న కన్నయ్యనాయుడు, మళ్లీ గేట్లు ఎత్తేలోపే కౌంటర్ వెయిట్ ఏర్పాటు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఒక గేటుకే సమస్య ఉన్నందున మిగిలిన గేట్లు ఎత్తుకోవచ్చని, గేట్లు అందరూ అనుకున్నంత పూర్తిగా దెబ్బతినలేదని తెలిపారు. గేట్లు దించకముందే ఢీకొన్న బోట్లను తీయాలని చూస్తున్నామన్నారు. సాయంత్రంలోపు ఒక నిర్ణయం తీసుకుని బోట్లు ఎలా తీయాలో చూస్తామని, గేట్లన్నీ బాగానే ఉన్నాయిన్నారు. కౌంటర్ వెయిట్‌కు ప్రత్యామ్నాయం చూస్తామని వెల్లడించారు. వారం, 15 రోజుల్లో సమస్యను పరిష్కరించవచ్చన్నారు. ఎంత వరద ప్రవాహం వచ్చినా బ్యారేజ్‌కి నష్టం లేదంటున్న కన్నయ్యనాయుడుతో మా ప్రతినిధి రమణ ముఖాముఖి.