ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

రాష్ట్రానికి ప్రత్యేకంగా రూ. వెయ్యి కోట్లు ఇవ్వాలి: మంత్రి సత్యకుమార్‌ - Satyakumar Met Union Ministers - SATYAKUMAR MET UNION MINISTERS

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 17, 2024, 7:00 PM IST

Health Minister Satyakumar Met Union Ministers in Delhi: కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోవడానికి సీఎం చంద్రబాబు శ్రమిస్తున్నారని గత ఐదేళ్లలో వైఎస్సార్​సీపీ ఎందుకు ప్రయత్నించలేదని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం వచ్చి నెల కూడా కాకముందే అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో జగన్ అనేక సార్లు దిల్లీ వెళ్లినా ఎందుకు నిధులు తేలేకపోయారని విమర్శించారు. అంతే కాకుండా ఎన్‌హెచ్‌ఎం కింద ప్రత్యేకంగా రాష్ట్రానికి రూ. 1000 కోట్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్టు సత్యకుమార్‌ తెలిపారు. దిల్లీలో పలువురు కేంద్రమంత్రులను కలిసిన అనంతరం సత్యకుమార్‌ మీడియాతో మాట్లాడారు. 

ఆరోగ్య మందిర్‌ భవనాల నిర్మాణానికి నిధులు అందించాలని కోరినట్టు చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ అంశాలపై కూడా చర్చించామన్నారు. 40 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై కేంద్ర మంత్రులు అడిగి తెలుసుకున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం ఉన్నప్పటికీ సామాజిక పింఛన్ల పెంపు, ఉచిత ఇసుక విధానం, అన్న క్యాంటీన్లు, స్కిల్‌ సెన్సస్‌ తదితర అంశాలపై వివరించామని సత్యకుమార్‌ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details