తెలంగాణ

telangana

ETV Bharat / videos

'కళాకారులందరికీ దేవుడులాంటి వ్యక్తి ఇవాళ దేవుడి దగ్గరికే వెళ్లిపోయారు' - Mallemala Production Head Paid Tribute to Ramoji - MALLEMALA PRODUCTION HEAD PAID TRIBUTE TO RAMOJI

By ETV Bharat Telangana Team

Published : Jun 8, 2024, 8:08 PM IST

Updated : Jun 8, 2024, 8:29 PM IST

Head of Mallemala production Tributes to Ramoji Rao : కొన్ని వేల కుటుంబాలకు ఉపాధి సృష్టించి తనకంటూ ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్న గొప్ప వ్యక్తి రామోజీరావు అని మల్లెమాల ప్రొడక్షన్ అధినేత​ శ్యామ్​ ప్రసాద్​ రెడ్డి అన్నారు. సమాజం కోసం జీవితమంతా కష్టపడిన వ్యక్తి అని పేర్కొన్నారు. తాను చిన్నప్పటి నుంచి ఆయన కలిసేవారని తెలియజేశారు. రామోజీ రావు నుంచి నిఘంటువు లాగా ఏదో ఒకటి నేర్చుకునే వాడినని వివరించారు. తన జీవితాన్ని చాలా ప్రభావితం చేసిన వ్యక్తి రామోజీనేనని చెప్పారు. 

Senior Actresses Paid Tribute to Ramoji Rao : రామోజీరావు మరణం తీరనిలోటు అని తెలుగుజాతి గొప్ప వ్యక్తిని మహాశక్తిని కోల్పోయిందని సీనియర్‌ నటీమణులు అన్నపూర్ణమ్మ, డబ్బింగ్‌ జానకీ, ఇంద్రజ అన్నారు. రామోజీరావు పార్థివదేహానికి వారు నివాళులర్పించారు. కళాకారులందరికీ దేవుడులాంటి వ్యక్తి ఇవాళ దేవుడు దగ్గరికి వెళ్లిపోయారని కన్నీటిపర్యంతమయ్యారు. చివరి వరకు మరచిపోలేమని తెలిపారు. తెలుగు భాషకు, తెలుగు జాతికి ఎంతో వెలుగు తెచ్చిన వ్యక్తి అని కీర్తించారు.

Last Updated : Jun 8, 2024, 8:29 PM IST

ABOUT THE AUTHOR

...view details