ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

భారీ వర్షంతో హంద్రీకి పోటెత్తిన వరద - నీట మునిగిన పలు కాలనీలు - Flood water into houses Heavy Rain - FLOOD WATER INTO HOUSES HEAVY RAIN

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 20, 2024, 6:55 PM IST

Handri River Flooded Due to Heavy Rain in Kurnool District : కర్నూలు జిల్లాలో కురిసిన భారీ వర్షానికి హంద్రీ నదికి వరద పోటెత్తింది. భారీ వర్షాలకు పలు చోట్ల వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఆస్పరి మండలంలోని ముత్తుకూరు, పుటకలమర్రి, వలగొండ గ్రామాల్లోకి భారీగా వరద నీరు చేరింది. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరద ఉద్ధృతితో మరికొందరు ఇళ్లకు తాళాలు వేసి ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. ముత్తుకూరు గ్రామంలోని ఎస్సీ కాలనీలో నీట మునిగిన ఇళ్లను, గుడిసెలను ఆస్పరి తహసీల్దార్ శివశంకర్ నాయక్ పరిశీలించారు. ప్రభుత్వానికి నివేదిక పంపుతామని ఆయన చెప్పారు.

వర్షానికి కోసిగి మండలం దేవరబెట్టకు వెళ్లే రోడ్డు కల్వర్టు తెగిపోయి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. హాలహర్వి మండలం అమృతాపురంలో టోపీ మారెమ్మవ్వ ఆలయంలోకి వరద నీరు ప్రవేశించింది. ఎడతెరిపి లేని వానకు పత్తికొండ- ఆదోని ప్రధాన రహదారిలో చిన్నహుల్తి సమీపంలోని హంద్రీ వాగు నిండుకుండలా ప్రవహిస్తోంది. వరద నీరు ప్రధాన రహదారిపైకి రావటంతో పత్తికొండ- ఆదోని మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి.

ABOUT THE AUTHOR

...view details