వైభవోపేతంగా ఇంద్రకీలాద్రి గిరిప్రదక్షణ - ఇంద్రకీలాద్రి గిరిప్రదక్షణ
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 24, 2024, 7:44 PM IST
Grandly Celebrated Indrakeeladri Giri Pradakshina Vijayawada : మాఘ పౌర్ణమిని పురస్కరించుకుని విజయవాడ (Vijayawada) ఇంద్రకీలాద్రి గిరిప్రదక్షణ భక్తి ప్రపత్తుల మధ్య వైభవంగా సాగింది. వేద మంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాల నడుమ దుర్గామల్లేశ్వర స్వామి ఉత్సవ మూర్తులతో ప్రదక్షిణ సాగింది. కామధేను అమ్మవారి ఆలయం నుంచి దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానం (Temple) వరకు ఈ ప్రదక్షిణ జరిగింది. భక్తులు దారిపొడవునా పూలు, పండ్లు, కొబ్బరికాయలు సమర్పించి పూజలు చేశారు. పౌర్ణమి రోజున అమ్మవారి శిఖరం చుట్టూ నిర్వహించే గిరి ప్రదక్షిణ చేస్తే కోరికలు తీరనుతాయనేది భక్తుల (Devotees) విశ్వాసం.
Giri Pradakshina on Indrakeeladri : కుమ్మరిపాలెం సెంటర్, నాలుగు స్థంబాల సెంటర్, సితార, కబేలా, పాల ఫ్యాక్టరీ, చిట్టి నగర్, కొత్తపేట, నెహ్రు బొమ్మ సెంటర్, బ్రాహ్మణ వీధి, ఘాట్ రోడ్ వరకు ప్రదర్శన నిర్వహించారు. నేడు అమ్మవారిని దర్శనం కోసం భక్త జనులు తరలి వచ్చారు. అమ్మవారి సేవలో తరించి దైవ (God) సేవలో మునిగిపోయారు.