వైన్‌షాపులో అర్ధరాత్రి మంటలు- రూ.9లక్షల మద్యం, సామగ్రి దగ్ధం - Liquor Shop Burnt Was Short Circuit - LIQUOR SHOP BURNT WAS SHORT CIRCUIT
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 4, 2024, 1:34 PM IST
Govt Liquor Shop Burnt Was Short Circuit in Addatigala : అల్లూరి జిల్లా అడ్డతీగలలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రభుత్వ మద్యం దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. శనివారం అర్ధరాత్రి సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకోగా దాదాపు 9 లక్షల రూపాయల విలువైన మద్యం సీసాలు, కంప్యూటర్లు, అక్కడ ఉన్న ఇతర సామగ్రి సైతం మంటల్లో కాలి బూడిదయ్యాయి. ఈ ప్రమాదంతో భారీగా నష్టం జరిగిందని దుకాణదారులు తెలిపారు. అర్ధరాత్రి సమయంలో ఈ ప్రమాదం జరగడంపై తమకు అనుమానంగా ఉందని దుకాణం నిర్వాహకులు పేర్కొన్నారు.
దుకాణాదారుల ఫిర్యాదుతో అడ్డతీగల పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం అర్ధరాత్రి జరగడంతో ఎవరికి ఎటువంటి ప్రాణహాని జరగలేదని పేర్కొన్నారు. దుకాణంలో అగ్ని ప్రమాదం జరగడానికి షార్ట్ సర్క్యూట్ కారణమా లేక ఎవరైనా కావాలనే ఈ దారుణానికి తెరతీశారనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.