ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలకు సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం - రేపు మంత్రుల బృందం భేటీ

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 11, 2024, 7:17 PM IST

Govt Discussions With Employees Union: ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వం చర్చలకు సిద్ధమైంది. పెండింగ్​లో ఉన్న సమస్యలపై ప్రభుత్వం ఉద్యోగ సంఘాల నేతలతో సోమవారం చర్చలు జరపనుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు సచివాలయం రెండో బ్లాక్​లో సమావేశానికి హాజరు కావాలని, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లోని ఉద్యోగ సంఘాలకు ఈ మేరకు పిలుపునిచ్చారు. పెండింగ్ సమస్యల పరిష్కారించాలని ఉద్యోగుల విజ్ఞప్తి మేరకు, ఉద్యోగ సంఘాలతో రాష్ట్ర మంత్రుల బృందం భేటీ కానుంది. 

6 వేల 700 కోట్ల రూపాయల మేర ఉద్యోగులకు ప్రభుత్వం బకాయిలు పడిందని ఉద్యోగులు వివరిస్తున్నారు. గత నాలుగు సంవత్సరాలుగా పెండింగ్​లో ఉన్న సమస్యలు పరిష్కారించాలని ఉద్యోగులు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. నాలుగు డీఏలు, సరెండర్ లీవులు, పదవీ విరమణ బకాయిలు చెల్లించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. జగన్​ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మాట తప్పారని ఉద్యోగ సంఘాలు ఇప్పటికే అందోళనలు చేస్తున్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమను పట్టించుకుని ఇచ్చిన హామీలను నేరవేర్చాలని నిరసనలు చేస్తున్నాయి.

ABOUT THE AUTHOR

...view details