ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

నాడు - నేడు కష్టాలు తీర్చలేదు - Government Hospital Situation

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 15, 2024, 1:50 PM IST

Government Hospital Situation in Srikakulam District : శ్రీకాకుళం జిల్లా కొత్తూరు సామాజిక ఆసుపత్రికి అవసరమైన అదనపు భవనాల నిర్మాణం ఆలస్యంగా జరుగుతుండడంతో కొత్తూరు మండలంతో పాటు సమీప గ్రామాల ప్రజలు వైద్య సేవలు (Medical Services) అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మూడేళ్ల క్రితం రూ.4 కోట్ల 20 లక్షలతో భవన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఆస్పత్రి నిర్మాణ పనులు గతేడాది అక్టోబర్ నెలకి (October Month) పూర్తి కావలసి ఉన్నప్పటికీ ఇప్పటికీ అరకొరగా పనులు జరుగుతూనే ఉన్నాయి. పూర్తిస్థాయిలో భవన  నిర్మాణాలు పూర్తి కాకపోవడంతో వార్డులు, వైద్యుల గదులు, సిబ్బంది గదుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. 

సమీపంలో ఉన్న పాత సామాజిక ఆసుపత్రిలో అధికంగా ఓపీ ఉన్న నేపథ్యంలో రోగులు వరండాపై మంచాలు వేసుకుని వైద్య సేవలు పొందుతున్నారు. భవనాన్ని (Building) పూర్తిస్థాయిలో నిర్మాణం చేపట్టి త్వరితగతిన స్థానిక ప్రజలకు సౌకర్యవంతమైన సేవలు అందించేలా చూడాలని స్థానికులు కోరారు.

ABOUT THE AUTHOR

...view details