ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

పట్టాలు తప్పిన గూడ్స్​ - ఆలస్యంగా నడిచిన రైళ్లు ​- ప్రయాణికులకు పాట్లు - Goods Train Derailed In Nandyal - GOODS TRAIN DERAILED IN NANDYAL

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 1, 2024, 3:59 PM IST

Goods Train Derailed In Nandyal railway Station : నంద్యాల రైల్వేస్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. గుంతకల్లు నుంచి విశాఖపట్నానికి నంద్యాల రైల్వే స్టేషన్ మీదుగా ఖాళీ ట్యాంకర్ గూడ్స్​ వెళ్తుండగా కొద్ది దూరం ప్రయాణించాక పట్టాలు తప్పింది. దీంతో అప్రమత్తమైన అధికారులు చర్యలు చేపట్టారు. దాదాపు గంట పాటు శ్రమించి గూడ్స్​ను పట్టాలెక్కించారు. 

గూడ్స్ రైలు పట్టాలపై ఆగిపోవడంతో పలు రైళ్ల రాకపోకలు గంటన్నర పాటు ఆలస్యంగా నడిచాయి. హుబ్లీ నుంచి విజయవాడ వెళ్లే రైలు కాచిగూడ రైలు నంద్యాలలో ఆగి గంటన్నర తర్వాత వెళ్లిపోయాయి. ట్రైన్లు ఆలస్యమవడంతో ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని నంద్యాల రైల్వేస్టేషన్​ అధికారులు తెలిపారు. పట్టాలు తప్పింది గూడ్స్​ రైలు కావడంతో ఎవరికీ ప్రమాదం జరగలేదని రైల్వే సిబ్బంది తెలిపారు. ఒక వేళ సాధారణ రైలు పట్టాలు తప్పి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని ప్రయాణికులు వాపోయారు.
 

ABOUT THE AUTHOR

...view details