కంటైనర్లో తరలిస్తున్న 450 కిలోల గంజాయి పట్టివేత - నిందితులు అరెస్ట్ - Ganja Gang Arrest at Bapatla
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 8, 2024, 3:53 PM IST
Ganja Gang Arrest at Bapatla: రాజమహేంద్రవరం నుంచి చెన్నైకి పెద్ద మొత్తంలో గంజాయిని తరలిస్తున్న కంటైనర్‌ను బాపట్ల జిల్లా సెబ్ అధికారులు (Special Enforcement Bureau) పట్టుకున్నారు. నిందితుల నుంచి 450 కిలోల గంజాయిని స్వాధీనం (450KG of Ganja Seized) చేసుకున్న పోలీసులు రెండు వాహనాలను సీజ్ చేశారు. గంజాయి తరలిస్తున్నట్లు వచ్చిన సమాచారంతో బాపట్ల పట్టణ బైపాస్ రోడ్డు వద్ద తనిఖీలు నిర్వహించారు. తనిఖీలో భాగంగా అక్రమంగా గంజాయిని తరలిస్తున్న కంటైనర్‌ను పోలీసులు గుర్తించి పట్టుకున్నారు. గంజాయిని తరలిస్తున్న వారిలో ఇద్దరు ఆంధ్రప్రదేశ్, మరొకరు తమిళనాడు రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు సెబ్ అధికారులు తెలిపారు.
"అక్రమంగా గంజాయిని తరలిస్తున్న నిందితులను పట్టుకుని గంజాయిని స్వాధీనం చేసుకున్నాం. వారి వద్ద ఉన్న రెండు వాహనాలను సీజ్ చేశాం. గంజాయిని తరలిస్తున్న వారిలో ఇద్దరు ఆంధ్రప్రదేశ్, మరొకరు తమిళనాడు రాష్ట్రానికి చెందినవారు." - నరసింహారావు, జిల్లా సెబ్ అధికారి