LIVE: ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభిస్తున్న సీఎం చంద్రబాబు - ప్రత్యక్ష ప్రసారం - FREE GAS CYLINDER SCHEME
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 1, 2024, 12:47 PM IST
|Updated : Nov 1, 2024, 4:38 PM IST
Free Gas Cylinder Scheme : కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్‌లో భాగంగా ఇచ్చిన ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్ల హామీని శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రారంభించనుంది. ఇచ్ఛాపురం మండలం ఈదుపురంలో ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభిస్తున్నారు. పర్యటనలో భాగంగా గ్రామస్థులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి మాట్లాడనున్నారు. అర్హులైన లబ్ధిదారులకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లను సీఎం చంద్రబాబు పంపిణీ చేయనున్నారు. దీపం-2 పథకంలో భాగంగా ప్రతి నాలుగు నెలలకు ఒక సిలిండర్ చొప్పున పేద ప్రజలకు ప్రభుత్వం ఉచితంగా అందించనుంది. అక్టోబర్ 29వ తేదీ నుంచి ప్రభుత్వం ఈ పథకం కింద గ్యాస్ బుక్ చేసుకునే అవకాశాన్ని లబ్ధిదారులకు కల్పించింది. గ్యాస్ సిలిండర్ అందిన 48 గంటల్లో లబ్ధిదారులు సిలిండర్‌కు చెల్లించిన సొమ్ము వారి ఖాతాలో జమ కానుంది. ఈదుపురం పర్యటన తర్వాత చంద్రబాబు శ్రీకాకుళం చేరుకుని ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం.
Last Updated : Nov 1, 2024, 4:38 PM IST