ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

నకిలీ బంగారంతో బ్యాంక్​లో కోటిన్నర స్వాహా - అంతా ఆయన పనే - Fraud With Fake Gold Jewellery

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 5, 2024, 7:50 PM IST

Fraud With Fake Gold Jewellery in Bapatla District : బాపట్ల పట్టణంలో తాజాగా ఘరానా మోసం వెలుగు చూసింది. నగరంలో ఉన్న బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర శాఖలో నకిలీ బంగారు నగలతో రూ.1.70 కోట్ల రుణం స్వాహా చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నేడు (మంగళవారం) బ్యాంకులో ఆడిట్ చేయగా అసలు బంగారం స్థానంలో నకిలీ బంగారం ఉన్నట్టు బ్యాంక్ మేనేజర్ హరీశ్ గుర్తించారు. వెంటనే జరిగిన మోసంపై బ్యాంక్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

Fake Gold Scam in Bapatla : కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా గోల్డ్ అప్రైజర్​గా ఉన్న రాఘవేంద్రరావు అండతోనే ఈ మోసం జరిగినట్టు పోలీసులు నిర్ధారించారు. ఇతను మొత్తం 21 ఖాతాల ద్వారా రూ. కోటి 77 లక్షల 62 వేలను నకిలీ బంగారం ద్వారా రుణం తీసుకున్నాడు. నిందితుడు ఇప్పటికే గంజాయితో పట్టుబడిన కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడని పోలీసులు తెలిపారు. 

ABOUT THE AUTHOR

...view details