ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఎన్నికలకు జగన్​ రూ.5 వేల కోట్లు ఖర్చు పెట్టాడు: చింతా మోహన్ - Chinta Mohan Sensational Comments - CHINTA MOHAN SENSATIONAL COMMENTS

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 25, 2024, 4:37 PM IST

Chinta Mohan Sensational Comments: డబ్బుల పంపిణీలో సీఎం జగన్​కు పద్మశ్రీ, పద్మవిభూషణ్ అవార్డులు ఇవ్వవచ్చని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ విమర్శలు గుప్పించారు. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన వైఎస్సార్సీపీపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో జగన్ పాలన ఐదేళ్లలో ప్రజలు విసిగిపోయారని ఎద్దేవా చేశారు. జగన్ పాలనలో ప్రజలు నలిగిపోయారని విమర్శించారు. ఈ విషయం పోస్టల్ బ్యాలెట్​ను చూస్తేనే తెలిసిపోయిందన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు జగన్​కు వ్యతిరేకంగా పడ్డాయని వెల్లడించారు. జగన్ మోహన్ రెడ్డి నాలుగు నుంచి 5వేల కోట్లు ఖర్చుపెట్టారని ఆరోపించారు. ఒక అసెంబ్లీ నియోజకవర్గంలోనే రూ. 80 కోట్లు ఖర్చుపెట్టారని తెలిపారు. శ్రీకాకుళం నుంచి కర్నూలు వరకూ ఓట్లు కొన్నాడని ఆరోపించారు. చిల్లర అంగడికిపోయి కొన్నట్లు ఓట్లను కొన్నాడని తెలిపారు. 

ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఆశించినంత వైభవాన్ని తీసుకురాలేక పోయిందని తెలిపారు. షర్మిలా అందరినీ కలుపుకుని పోలేదని అన్నారు. దేశంలో బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని చెప్పారు.  కేంద్రంలో మోదీ వ్యతిరేక ప్రభుత్వం రాబోతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని అన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చింతా మోహన్​ స్పష్టం చేశారు. 

ABOUT THE AUTHOR

...view details