ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

జగన్‌ బొమ్మతో గిఫ్ట్ ప్యాకెట్స్ - ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీల్లో బయటపడ్డ ఖరీదైన వస్తువులు - flying squad find ycp gift packs - FLYING SQUAD FIND YCP GIFT PACKS

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 23, 2024, 10:13 PM IST

Flying Squad Find YCP Leaders Gift Packs in Prakasam District : రాష్ట్రంలో ఎన్నికల నియామావళి అమలులోకి వచ్చినప్పటినుంచి రహదారులపై అధికారులు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. ఎక్కడ కూడా కోడ్ ఉంల్లంఘన జరగకుండా గట్టి నిఘా పెట్టారు. ఇందుకోసం ఎన్నికల కమిషన్ ప్రత్యేకంగా ఫ్లయింగ్ స్క్వాడ్​ను సైతం నియమించింది. ఇంత పటిష్ఠంగా ఏర్పాట్లు చేసినప్పటికి వైఎస్సార్సీపీ నాయకులు వీటిని బేఖాతరు చేసి యథేచ్ఛగా ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. తాజాగా ప్రకాశం జిల్లాలో జగన్ బొమ్మలతో కూడిన గిఫ్ట్ ప్యాకెట్స్​ను తరలిస్తూ అధికారులకి పట్టుబడిన ఘటన కలకలం రేపుతొంది. జిల్లాలోని గిద్దలూరుకు సమీపంలో ఉన్న జాతీయ రహదారిపై ఓ కారులో జగన్‌ బొమ్మతో కూడిన గిఫ్ట్ ప్యాకెట్స్​ను​ వైసీపీ నేతల అండతో ఓ వ్యక్తి తరలిస్తున్నాడు.

సాధారణ తనిఖీల్లో భాగంగా వాహనాలను తనిఖీ చేసిన ఫ్లయింగ్ స్క్వాడ్​ అధికారులకు జగన్ బొమ్మతో కూడుకున్న గిఫ్ట్ ప్యాకెట్స్ పట్టుబడ్డాయి. అంతేగాకుండా ఆ గిఫ్ట్ ప్యాక్‌లపై గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు నాగార్జున రెడ్డి, ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫోటోలు ఉన్నాయి. వీటిలో ఖరీదైన వాటర్ బాటిల్, హాట్ బాక్సులు ఉన్నాయి. వీటిని వాలంటీర్లకు పంపణీ చేసేందుకు ఆయా నియోజకవర్గలకు తరలిస్తుండగా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గిఫ్ట్ ప్యాకెట్లు తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్న అధికారులు విచారిస్తున్నారు. 

ABOUT THE AUTHOR

...view details