వరద తగ్గుముఖం- తేరుకుంటున్న విజయవాడ నగరం - Floods Reducing in Vijayawada - FLOODS REDUCING IN VIJAYAWADA
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 11, 2024, 3:53 PM IST
Floods Gradually Reducing in Vijayawada : వరద విలయం నుంచి విజయవాడ నగరం తేరుకుంది. ముంపు ప్రాంతాలను చుట్టేసిన వరద క్రమంగా తగ్గుముఖం పట్టింది. దాదాపు 90 శాతం ప్రాంతాలు సాధారణ స్థితికి చేరుకున్నాయి. వరద నీటికి మురుగు తోడవడంతో ఇళ్లలో నిలిచిన నీటిని బయటకు పంపే క్రమంలో పాయకాపురం, నున్న తదితర ప్రాంతాల్లో రహదారులపై నీరు ప్రవహిస్తోంది. అనుకోని ఆపదతో అతలాకుతలైన బెజవాడలో పరిస్థితులు కుదుటపడుతున్నాయి. గత రెండ్రోజులుగా వర్షాలు లేకపోవడం, ఎండ కాస్తుండడంతో ముంపు ప్రాంతాల్లో పొడి వాతావరణం కనిపిస్తోంది.
సాధారణ వాహనాల రాకపోకలతో ఆర్టీసీ బస్సుల పునరుద్ధరణతో నగర వాసులు తమ దైనందిక జీవనం వైపు కదులుతున్నారు. శివారు ప్రాంతాల్లో పరిస్థితులు ఇంకా పూర్వ స్థితికి రాకపోయినా కొంచెం మెరుగ్గా ఉన్నాయని స్థానికులు తెలుపుతున్నారు. ఇంకో రెండు రోజులపాటు వాతావరణం ఇదే విధంగా ఉంటే అన్నీ సాధారణమైపోతాయమని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు బెజవాడ వాసులు. విజయజవాడలో తాజా పరిస్థితులను మా ప్రతినిధి శ్రీనివాసమోహన్ వివరిస్తారు.