ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

అనకాపల్లిలో పడవ ప్రమాదం - గల్లంతైన మృతదేహం కోసం గాలింపు చర్యలు - nanthavaram mandal FishBoat Capsize - NANTHAVARAM MANDAL FISHBOAT CAPSIZE

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 1, 2024, 2:09 PM IST

Fishing Boat Capsized In Tandava Reservoir: చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు పడవ బోల్తా పడిన ఘటనలో ఒక వ్యక్తి గల్లంతు (Missing) అవ్వగా మరో ఇద్దరిని స్థానికులు సురక్షితంగా రక్షించారు. ఈ ఘటన అనకాపల్లి జిల్లా నాతవరం మండలం తాండవ జాలాశయంలో చోటుచేసుకుంది. మృతుని కోసం గజ ఈతగాళ్లతో కలిసి పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. మృతుడు గొలుగొండ మండలం పొగచెట్ల పాలెంకు చెందిన అప్పారావుగా స్థానికులు తెలిపారు. 

One Person Died And Another Was Missing: స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం జిల్లాలోని గొలుగొండ మండలం పోగా చెట్ల పాలెం గ్రామానికి చెందిన గరగల అప్పారావు (30) అనే మత్స్యకారుడు తన సహచరులతో కలిసి ఆదివారం తెల్లవారుజామున తాండవ జలాశయాం లోకి బోటు వేసుకుని చేపల వేటకు (fishing) వెళ్లారు. వేటకు వెళ్లిన కొద్ది సేపటికే ప్రమాదవశాత్తు బోటు బోల్తా పడింది. అప్పారావు గల్లంతుతో అతని భార్య, ముగ్గురు ఆడపిల్లలు, వృద్ధులైన ఇద్దరు తల్లిందండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. 

ABOUT THE AUTHOR

...view details