కుమారుడిని కొట్టిన టీచర్ - చర్యలు తీసుకోవాలని తండ్రి పోరాటం - Father Complaint on teacher - FATHER COMPLAINT ON TEACHER
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 7, 2024, 2:59 PM IST
|Updated : Sep 7, 2024, 3:15 PM IST
Father Complained to Collector Against Teacher For Hitting His Son For No Reason : ఉపాధ్యాయుడుతన కుమారుడిని అకారణంగా కొట్టాడని అతనిపై చర్యలు తీసుకోవాలని ఓ తండ్రి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాడు. ఈ ఘటన అల్లూరి జిల్లాలో జరిగింది. ఆ తండ్రి గత రెండు వారాలుగా కార్యాలయాల చుట్టూ కుమారుడిని ఎత్తుకుని వెళ్తున్నాడు. తనకు న్యాయం చేయాలని కోరుతున్నాడు. ఆగస్టు 23న అల్లూరి జిల్లా హుకుంపేట మండలం పాతకోటలోని ఎంపీపీ పాఠశాలలో ఓ టీచర్ చిన్ని కృష్ణ అనే రెండో తరగతి విద్యార్థిని పచ్చి వెదురు కర్రతో ఒంటినిండా గాయాలు అయ్యేలా కొట్టాడని బాలుడి తండ్రి వాపోతున్నారు.
ఏ విద్యార్థి గోల చేసిన నిన్నే కొడతాడని కొట్టినట్టు మిగిలిన పిల్లలు చెబుతున్నారు. దీంతో అప్పటి నుంచి తండ్రి సింహాచలం ఎంఈఓ, డీఈవో కలెక్టర్లకు ఫిర్యాదు చేశారు. ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన చెందుతున్నాడు. తాను ఒంటరిగా పోరాటం చేస్తున్నట్లు అవసరమైతే కమిషనర్ వరకూ వెళ్తానని బాధితుడు పేర్కొన్నాడు.