ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

అవనిగడ్డలో తప్పిన పెనుప్రమాదం- సిలిండర్​ ఆటో, పోలీస్ వాహనం ఢీ - Excise Vehicle Gas Auto Accident - EXCISE VEHICLE GAS AUTO ACCIDENT

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 15, 2024, 4:49 PM IST

Excise Vehicle Gas Auto Accident At Avanigadda: ఎక్సైజ్ వాహనం, గ్యాస్ సరఫరా ఆటో ఎదురెదురుగా ఢీకొన్న ఘటన కృష్ణా జిల్లా కోడూరు మండలం మాచవరంలో అవనిగడ్డలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఎక్సయిజ్ వాహనం రోడ్డు ప్రక్కనే ఉన్న మురుగు బోదెలోకి పల్టి కొట్టగా, ఆటో బోల్తా పడటంతో గ్యాస్ సిబ్బందికి గాయాలయ్యాయి. గ్యాస్ ఆటో ప్రక్కన ఇనుప ఫ్రేమ్​ను ఢీకొనడంతో గ్యాస్ లోడుతో ఉన్న సిలిండర్లు పేలలేదు. దీంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు ఉపిరిపీల్చుకున్నారు.  

బాధితుడు తెలిపిన వివరాలు ప్రకారం అవనిగడ్డ నుండి లింగారెడ్డి పాలెం గ్యాస్ బండలతో ప్రయాణిస్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న ఎక్సైజ్ వాహనం ఢీకొంది. ఈ క్రమంలో ఇరు వాహనాలు బోల్తా పడ్డాయి. ఎక్సైజ్ వాహనం ముందు భాగం దెబ్బతింది. ఎక్సైజ్ వాహనం రాంగ్​ రూట్​లో రావడం వల్లే ప్రమాదం జరిగిందని గ్యాస్ డెలివరీ బాయ్ తెలిపారు. ఆటోలో ఇరుక్కున్న వ్యక్తిని స్థానికులు బయటకు తీసి ప్రాణాలు రక్షించారని బాధితుడు తెలిపారు. క్షతగాత్రులను అవనిగడ్డ ఏరియా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అవనిగడ్డ ఎస్సై సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details