ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ప్రత్తిపాడులో వైఎస్సార్సీపీకి ఎదురుదెబ్బ- మున్సిపల్​ ఛైర్మన్​ పార్టీకి రాజీనామా - Eleswaram Municipal Chairman resign - ELESWARAM MUNICIPAL CHAIRMAN RESIGN

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 28, 2024, 7:31 PM IST

Eleswaram Municipal Chairman Resign From YSRCP : కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో వైసీపీకి ఎదురుదెబ్బ తలిగింది. ఏలేశ్వరం మున్సిపల్ ఛైర్మన్ అలమండ సత్యవతి, కౌన్సిలర్ చలమయ్య వైసీపీకి రాజీనామా చేశారు. వీరితోపాటు పలువురు వైసీపీ అసమ్మతి వర్గాల వారు కూడా పార్టీని వీడారు. కౌన్సిలర్ చలమయ్య వైసీపీ జిల్లా కార్యనిర్వహక కార్యదర్శి, తుని నియోజవర్గ పరిశీలకునిగా వ్యవహరిస్తున్నారు. ఈ పదవులకు కూడా ఆయన రాజీనామా చేశారు. వైసీపీ ఇన్ ఛార్జ్ వరుపుల సుబ్బారావు పెత్తనం చెలాయిస్తున్నారని నాయకులు ఆవేదన వ్యక్తంచేశారు. పార్టీలో గుర్తింపు లేక రాజీనామా చేశామని తెలిపారు. త్వరలోనే తమ భవిష్యత్తు  కార్యాచరణను ప్రకటిస్తాని పేర్కొన్నారు.

తమకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజలు తమ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారని చలమయ్య ఈ సందర్భంగా తెలియజేశారు. తాము తీసుకున్న నిర్ణయాలను, తీర్మానాలను నియోజక వర్గ  ఇన్​ఛార్జ్​ గౌరవించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మనోభావాలు, విలువలను చంపుకొని పార్టీలో ఉండలేక రాజీనామా చేస్తున్నారని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details