ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

విజయనగరం జిల్లాలో ఏనుగుల గుంపు హల్​చల్ - పంట పొలాలు ధ్వంసం - Elephants Wandering in Vizianagaram - ELEPHANTS WANDERING IN VIZIANAGARAM

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 12, 2024, 11:50 AM IST

Elephants HulChal Vizianagaram District : విజయనగరం జిల్లాలో ఏనుగుల గుంపు హల్​చల్​ చేస్తోంది. అటవీ ప్రాంతం నుంచి దారితప్పిన గజరాజులు వంగర మండలంలోని వీవీఆర్ పేట, రాజులుగుమ్మడ గ్రామాల్లో తిష్టవేశాయి.  దీంతో అక్కడి ప్రజలకు కంటి మీద నిద్ర ఉండటం లేదు. మరోవైపు స్థానికులు వీటి భయంతో బయటకు వచ్చేందుకు  బెంబేలెత్తుతున్నారు. దీనికితోడూ అవి పంట పొలాలపై దాడి చేసి వరి, చెరకు, మొక్కజొన్న, కూరగాయల పంటలను నాశనం చేస్తున్నాయి.

Elephants Roaming in Vangara : దీనిపై గ్రామస్థులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు గజరాజులను అటవీ ప్రాంతలోకి తరలించేందుకు చర్యలు చేపట్టారు. ఏనుగుల వల్ల తమ పంటలు నాశనం అవుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాటి బారి నుంచి తమను రక్షించాలని కోరుతున్నారు. అదేవిధంగా నష్టపోయిన తమ పంటలకు పరిహారం చెల్లించాలని డిమాండ్​ చేశారు. మరోవైపు ఏనుగుల సంచారంతో గ్రామాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ అధికారులు తెలిపారు. వాటిపై ఎటువంటి కవ్వింపు చర్యలు పాల్పడవద్దని వారు చెప్పారు. 

ABOUT THE AUTHOR

...view details