ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ప్రకాశం జిల్లాలో దారుణం - విద్యుత్ షాక్​కు గురై ఉద్యోగి మృతి - worker died due to current shock

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 23, 2024, 10:34 PM IST

Electricity Worker Died Due to Current Shock in Prakasam District : కరెంటు పోల్స్ నిర్మిస్తుండగా విద్యుత్ కాంట్రాక్టు ఉగ్యోగి మృతి చెందిన ఘటన ప్రకాశం జిల్లాలో కలకలం రేపింది. జిల్లాలోని కంభం మండలం ఎర్రబాలెం గ్రామంలో శుక్రవారం ఈ విషాదం చోటుచేసుకుంది. కంభం మండలంలో వెంకటేశ్వర్లు అనే వ్యక్తి విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగిగా పని చేస్తున్నారు. అయితే ఎర్రబాలెం గ్రామంలో నూతనంగా కరెంటు పోల్స్ నిర్మాణం చేపట్టారు. అక్కడ పోల్స్ నిర్మిస్తుండగా వెంకటేశ్వర్లు విద్యుత్ షాక్​కు గురై అక్కడికక్కడే మృతి చెందారు. వెంటనే తెరుకున్న అక్కడి స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించారు. 

మృతుడు కంభం మండలానికి చెందిన వ్యక్తిగా పోలీస్​లు గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. అనంతరం వివరాలు నమోదు చేసుకున్న పోలీసులు మృతిపై దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లుగా కుటుంబ సభ్యులు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details