ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో ఓటర్ల అవగాహన సదస్సులు - ఓటర్ల దినోత్సవం స్పెషల్

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 25, 2024, 2:07 PM IST

Eenadu-ETV Vote Awareness Conference: జనవరి 25 ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఓటు ప్రాధాన్యం, నమోదుపై ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో బాపట్ల, పల్నాడు జిల్లాల్లోని కళాశాలల్లో అవగాహన సదస్సులు నిర్వహించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత యువతరంపై ఉందని అర్హులైన ప్రతిఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని బాపట్ల జిల్లా చీరాల తహశీల్దార్ ప్రభాకరరావు అన్నారు. ఓటర్ల చైతన్యం కోసం ఈనాడు-ఈటీవీ చేస్తున్న ప్రయత్నాన్ని ఆయన అభినందించారు. 

Voters Day Special Events in Bapatla and Palnadu Districts: 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకుని సద్వినియోగం చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ జయశ్రీ విద్యార్థినులకు సూచించారు. పల్నాడు జిల్లా గురజాలలోని స్కాలర్స్‌ కళాశాలలో ముఖ్య అతిథిగా హాజరైన పిడుగురాళ్ల డిప్యూటి తహశీల్దార్‌ అనురాధ విద్యార్థులంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని అన్నారు. పిడుగురాళ్ల టౌన్‌ ప్లానింగ్‌ అధికారి ధనలక్ష్మి విద్యార్థులతో ఓటరు హెల్ప్‌లైన్‌ యాప్‌ డౌన్లోడ్‌ చేయించి, ఓటు ఎలా నమోదు చేసుకోవాలో వివరించారు.

ABOUT THE AUTHOR

...view details