తిరుమల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ - శాస్త్రోక్తంగా ధ్వజారోహణం - TIRUMALA BRAHMOTSAVAM - TIRUMALA BRAHMOTSAVAM
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 4, 2024, 7:34 PM IST
Tirumala Srivari Salakatla Brahmotsavam : తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధ్వజారోహణం శాస్త్రోక్తంగా జరిగింది. ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ అర్చకులు గరుడపటాన్ని ఎగురేశారు. సాయంత్రం 5.45 గంటల నుంచి 6 గంటల మధ్య మీన లగ్నంలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం (Dwajarohanam Program at Tirumala) నిర్వహించారు. బ్రహ్మోత్సవాలకు ధ్వజారోహణంతో అంకురార్పణ జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారి సమక్షంలో వేదగానాల మధ్య మంగళవాద్యాలు మోగుతుండగా అర్చకస్వాములు బంగారు ధ్వజస్తంభంపై గరుడధ్వజాన్ని ఎగురవేశారు.
ఈ కార్యక్రమం ద్వారా సకల దేవతలను, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. కాగా రాత్రి 9 నుంచి 11 గంటల వరకు పెద్ద శేష వాహన సేవలు ప్రారంభమవుతాయి. ఈ క్రమంలో తిరుమలలో ఫలపుష్ప ప్రదర్శనశాలను ఈవో, అదనపు ఈవో ప్రారంభించారు. టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో కల్యాణవేదిక వద్ద ఫలపుష్ప ప్రదర్శనశాల జరిగింది. ఫలపుష్పశాలను శ్యామలరావు, వెంకయ్యచౌదరి పరిశీలించారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఫలపుష్ప ప్రదర్శనశాల కనువిందు చేస్తున్నాయి.