ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

కావలిలో డ్రగ్స్​ ముఠా అరెస్ట్​, అంతా డిగ్రీ, ఇంజనీరింగ్​ విద్యార్థులే - కావలిలో డ్రగ్స్ ముఠా అరెస్ట్​

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 24, 2024, 1:33 PM IST

Drugs Mafia Busted In Kavali Nellore District : నెల్లూరు జిల్లా కావలిలో యువతను లక్ష్యంగా చేసుకొని డ్రగ్స్ (Drugs)​ సరఫరా చేస్తున్న ముఠాను కావలి పోలీసులు పట్టుకున్నారు. స్థానిక ఇందిరానగర్​లో సీఐ రాజేష్ నిర్వహించిన దాడుల్లో ఒడిశాకు చెందిన వ్యక్తిని, అతని ఇంట్లోని గంజాయి ప్యాకెట్లు, మత్తుమందులను స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లింగ్ ముఠాలోని మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారని పోలీసులు (Police) తెలిపారు.

Drugs Gang Arrest in Nellor District : గంజాయి (Ganjai) సహా పలు హానికరమైన మందులు వీరి వద్ద లభిచాయమని పోలీసులు తెలిపారు. నిందితులను విచారించగా పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయని పోలీసులు వెల్లడించారు. వీరంతా డిగ్రీ, ఇంజనీరింగ్ చదివే విద్యార్థులుగా గుర్తించారు. ఈ సందర్ఙంగా సీఐ రాజేష్​ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా చూడాల్సిన బాధ్యత మన అందరి పై ఉందన్నారు. పిల్లల నడవడికలు తల్లిదండ్రులు గమనించాలని సూచించారు. ఈ కేసును ఛేదించిన సీఎ రాజేష్, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.
 

ABOUT THE AUTHOR

...view details