LIVE: అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం - ప్రత్యక్ష ప్రసారం - DONALD TRUMP INAUGURATION
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 20, 2025, 9:56 PM IST
|Updated : Jan 20, 2025, 10:54 PM IST
Donald Trump inauguration Live : అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేశారు. వాషింగ్టన్ డీసీ క్యాపిటల్ హిల్‌లోని రోటుండా ఇండోర్‌లో ట్రంప్ ప్రమాణ స్వీకారం వైభవంగా జరిగింది. దీంతో రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసినట్లు అయింది. ట్రంప్ ప్రమాణస్వీకారానికి వివిధ దేశాధినేతలకు శ్వేతభవనం నుంచి ఆహ్వానాలు వెళ్లాయి. భారతదేశం నుంచి ప్రధాని మోదీ తరఫున ట్రంప్ ప్రమాణస్వీకారానికి విదేశాంగమంత్రి జైశంకర్ వెళ్లి, ప్రధాని మోదీ ఇచ్చిన లేఖను ట్రంప్‌కు అందజేశారు. అలాగే ప్రమాణస్వీకారానికి అంబానీ దంపతులు హాజరయ్యారు. ప్రపంచ వ్యాపార దిగ్గజాలు ఎలాన్ మస్క్, మార్క్ జుకర్‌బర్గ్, జెఫ్ బెజోస్, సామ్ ఆల్ట్‌మన్, సుందర్ పిచాయ్ వంటివారు హాజరయ్యారు. ఈసారి ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవ ఖర్చులు కోసం దాదాపు రూ.1,400 కోట్ల విరాళాలు సేకరించారు. దీనికి బెజోస్, జుకర్ బర్గ్, ఉబెర్ సీఈఓ ఖోస్రోషాహీనే చెరో రూ.8,65 కోట్లను విరాళంగా ఇచ్చారు. ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి భారీగా విరాళాలు అందించిన పెద్దస్థాయి దాతలకు ప్రత్యేక ప్రైవేటు విందును ఏర్పాటు చేశారు.
Last Updated : Jan 20, 2025, 10:54 PM IST