ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

యాదాద్రి జిల్లాలో బోల్తా పడిన డీజిల్​ ట్యాంకర్ - బకెట్లు, డబ్బాలతో ఎగబడిన జనం - Diesel Tanker Lorry RollOver In Yadadri - DIESEL TANKER LORRY ROLLOVER IN YADADRI

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 7, 2024, 7:58 PM IST

Diesel Tanker Lorry Rolled Over in Yadadri : తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో డీజిల్​ ట్యాంకర్​తో వెళ్తున్న లారీ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ క్రమంలో అక్కడ గుమిగూడిన స్థానికులు డీజిల్​ తీసుకువెళ్లేందుకు క్యూ కట్టారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. 

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం : యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం పెద్ద పర్వతాపూర్ గ్రామ శివారులో ప్రమాదవశాత్తు డీజిల్ ట్యాంకర్ బోల్తా పడింది. డీజిల్ ట్యాంకర్ లారీ బోల్తా కొట్టడం గమనించి అటుగా వెళుతున్న కొంతమంది జనం అక్కడ గుమిగూడారు. ముందుగా ఎవరికైనా గాయాలయ్యాయో ఆరా తీశారు. డ్రైవర్ ప్రాణాలతో బయటపడటంతో ఊపిరి పీల్చుకున్నారు.

అనంతరం డీజిల్​ కోసం బకెట్లు, డబ్బాలతో లైన్ కట్టారు. అందినకాడికి డీజీల్‌ను తీసుకెళ్లిపోయారు. ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు త్వరితగతిన అక్కడికి చేరుకుని వారిని నియంత్రించారు. అనంతరం సహాయక చర్యలు చేపట్టారు. మూడు క్రేన్ల సాయంతో బోల్తా కొట్టిన లారీని సరిచేశారు. వెంటనే అక్కడి నుంచి బయటకి తీశారు. 

ABOUT THE AUTHOR

...view details