ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

వైసీపీ దుష్ప్రచారంపై పోలీసులకు ఫిర్యాదు - స్పందించకుంటే కోర్టును ఆశ్రయిస్తాం: ధూళిపాళ్ల - Dhulipalla Fight till Justice Done

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 22, 2024, 3:03 PM IST

Dhulipalla Narendra Complained Against the Leaders with Evidence : సామాజిక మాధ్యమాల్లో తనపై అసత్య ప్రచారాలు చేస్తున్న అధికార పార్టీ నాయకులపై ఆధారాలతో ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలుగుదేశం సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర మండిపడ్డారు. అంబేద్కర్ విగ్రహానికి సంబంధించి వైసీపీ చేస్తున్న దుష్ప్రచారం వెనుకున్న సూత్రధారులపై చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ధూళిపాళ్ల నరేంద్ర ఫిర్యాదు చేశారు. పోలీసులు తనకు న్యాయం చేయకపోతే కోర్టును ఆశ్రయిస్తానని హెచ్చరించారు. 

Dhulipalla will Fight till Justice is Done : అధికార పార్టీలోని ఎమ్మెల్యేలు, మంత్రులు తనపై కుట్రతోనే అసత్య ప్రచారాలు చేస్తున్నారని ధూళిపాళ్ల ఆరోపించారు. వీటిపై పొన్నూరు రూరల్​ పోలీస్​ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే అధికారులు ఎఫ్​ఐఆర్​ కూడా నమోదు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఉన్నతాధికారుల నుంచి సరైన ప్రతిస్పందన లేకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని పేర్కొన్నారు. ఈ కుట్ర వెనకున్న సూత్రధారులపై చర్యలు తీసుకునే వరకు పోరాటం చేస్తానని ధూళిపాళ్ల స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details