ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

మేత మేస్తున్న ఆవు నోట్లో పేలిన డిటోనేటర్ - కన్నీటి పర్యంతమైన యజమాని - detonator exploded

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 31, 2024, 10:29 PM IST

Detonator Exploded and Seriously Injured the Cow : అటవీ ప్రాంతంలో మేత మేస్తున్న ఆవు నోట్లో ఒక్కసారిగా డిటోనేటర్ పేలి దవడ పేలిపోయిన ఘటన సత్యసాయి జిల్లా పెనుకొండ మండలంలోని హరిపురం గ్రామంలో చోటు చేసుకుంది. డిటోనేటర్ పేలిన శబ్దానికి  చుట్టుపక్కల ఆవులు ఒక్కసారిగా పరుగులు తీసాయి. వెంటనే గమనించిన యజమాని ఆవు వద్దకు వెళ్లి చూడగా కింది దవడ పగిలిపోయి, తీవ్ర రక్తస్రావం అవుతోంది. దీంతో వెంటనే ఆవును ఇంటికి తోలుకువచ్చి వైద్యుడిని సంప్రదించింది. పరిశీలించిన వైద్యుడు దవడ ఎముక, నాలుక తెగిపోవడంతో కట్టు కట్టేందుకు సాధ్యం కాదని తెలియజేశారు. 

ప్రతిరోజు ఉదయం, సాయంత్రం మూడు లీటర్ల పాలు ఇస్తూ తమకు జీవనదారంగా ఉందని ఆవు యజమాని తెలిపారు. ఇటీవల ఆవును రూ. 45 వేలకు బహిరంగ మార్కెట్లో వ్యాపారులు తీసుకుంటామన్న అమ్మేందుకు కుటుంబసభ్యులకు ఇష్టం లేక తమ వద్దే ఉంచుకున్నారు. చివరికి చేసేదేమిలేక రూ. 5వేలకు ఆవును విక్రయించారు. ఇటువంటి ఆవు తమ నుంచి వెళ్లిపోవడంతో వారు కన్నీటి పర్యంతమయ్యారు.

ABOUT THE AUTHOR

...view details