జగన్ హయాంలో దళితులపై దాడి- సత్వర చర్యలకు విదసం జేఏసి డిమాండ్ - DALIT COMMUNITIES FORUM MEETING
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 27, 2024, 6:03 PM IST
Dalit Communities United Forum Meeting in Amalapuram : వైఎస్సార్సీపీ హయాంలో దళితులపై అనేక దాడులు జరిగాయని, దళితులపై దాడి చేసిన వారిపై ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విస్తృత దళిత సంఘాల ఐక్యవేదిక కోరింది. కోనసీమ జిల్లా అమలాపురంలో విదసం ఐక్య వేదిక సమావేశం జరిగింది. దాడులకు గురైన బాధితులను సమావేశంలో పరిచయం చేశారు. దళిత డ్రైవర్ హత్య కేసులో ఎమ్మెల్సీ అనంత బాబు బెయిల్ రద్దు చేసి, ఆయన భార్యను ఎఫ్ఐఆర్లో రెండో నిందితురాలుగా చేర్చాలని దళిత నేతలు కోరారు. ధనపల్లి శీనుపై ఎన్ఐఏను తప్పించాలని, రాష్ట్ర పోలీసులు చేత దర్యాప్తు చేయించాలని అన్నారు. శిరోముండనం కేసులో నిందితుడు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు బెయిల్ రద్దు చేయాలని కోరారు. గోపాలపురంలో పేపర్ ప్లేట్లు అంబేద్కర్ ఫోటో కేసుకు సంబంధించి తిరిగి విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. బాధిత దళితులకు కూటమి ప్రభుత్వం న్యాయం చేయాలని అన్నారు. ఈ అంశాలలో కూటమి ప్రభుత్వం బాధిత దళిత కుటుంబాలకు న్యాయం చేయాలని దళిత సంఘాల ఐక్యవేదిక విజ్ఞప్తి చేసింది.