ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఆటోమేటిక్ ఫిట్​నెస్ టెస్టింగ్ సెంటర్ బిడ్డింగ్ ఆపాలి: సీపీఎం - సీపీఎం కార్యదర్శి శ్రీనివాసరావు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 31, 2024, 6:42 PM IST

CPI State Secretary Srinivasa Rao on Automatic Testing Center: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమీపిస్తున్న వేళ ఆటోమేటిక్ ఫిట్​నెస్ టెస్టింగ్ సెంటర్ కోసం బిడ్డింగ్ ఆహ్వానించిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆరోపించారు. ఆర్​టీఏ, బ్రేక్​ ఇన్​స్పెక్టర్ అధికారుల వేధింపులు ఎక్కువుగా జరుగుతున్నాయని అన్నారు. ఈ బిడ్డింగ్​ల ద్వారా డబ్బులు దండుకుంటారని శ్రీనివాసరావు అన్నారు. ఎన్నికల తర్వాత అందరితో చర్చించి బిడ్డింగ్​పై నిర్ణయం తీసుకోవాలని అన్నారు. ప్రస్తుతం ఎవరికీ తెలియకుండా బిడ్డింగ్ నిర్వహిస్తున్నారని, బిడ్డింగ్ ఆపాలని కోరారు. ఆటోమేటిక్ టెస్టింగ్ సెంటర్ ద్వారా వేల కోట్ల రూపాయలు దండుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిట్​నెట్ సర్టిఫికెట్ ఇప్పటివరకు ఆర్​టీఏ అధికారులు ఇచ్చేవారు. ఇప్పటి నుంచి ప్రైవేట్ వ్యక్తులు ఇస్తారన్నారు. 

మొత్తం రోడ్డు ప్రమాదంలో 56శాతం హైవేపై జరుగుతున్నాయని అన్నారు. ప్రమాదాలు అరికట్టే దిశగా చర్యలు తీసుకోవటం లేదని శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపటి నుంచి 10 రోజుల పాటు ప్రజా క్యాంపెయిన్ చేస్తున్నామని, ప్రజలు ఆదరించాలని కోరారు. అందరూ ప్రజలకు డబ్బులు పంచుతున్నారు కానీ, తాము నిధుల కోసం ప్రజల దగ్గరకి వెళ్తున్నామన్నారు. ఆటోమెటిక్ టెస్టింగ్ స్టేషన్ పేరుతో కేంద్ర ప్రభుత్వంతో కుమ్మక్కై ప్రైవేటీకరణ ప్రక్రియకు పూనుకుంటోందని సీపీఎం నేత బాబూరావు పేర్కొన్నారు. ఈ పేరుతో 1000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజల మీద భారం వేయడానికి ప్రభుత్వం సిద్ధమైందని మండిపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details