ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

మదనపల్లెలో భూ బాధితుల సదస్సు: సీపీఐ రామకృష్ణ - CPI Ramakrishna on Land Grabbing - CPI RAMAKRISHNA ON LAND GRABBING

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 3, 2024, 7:28 PM IST

CPI Ramakrishna on YSRCP Leaders Land Grabbing: వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన భూకబ్జాలు, భూ బదలాయింపు బాధితులతో ఆగస్టు 4వ తేదీన మదనపల్లెలో సదస్సు నిర్వహిస్తున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. ఈ సమస్య అత్యంత తీవ్ర స్థాయిలో ఉందని పేర్కొన్నారు. అధికారులు వైఎస్సార్సీపీ నాయకులతో కుమ్మక్కై గత ప్రభుత్వ హయాంలో భూకబ్జాలకు పాల్పడి, ప్రభుత్వం మారగానే ఆ రికార్డులను ధ్వంసం చేసేందుకు కూడా వెనకాడటం లేదని మండిపడ్డారు. దీనిని బట్టే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోందని అన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈ ఆక్రమణలు జరిగాయని తెలిపారు.

వీటన్నింటిపైనా బాధితులు పెద్ద సంఖ్యలో ముందుకు వస్తున్నారని అన్నారు. వారందరినీ సమీకరించడానికి సీపీఐ తరఫున తాము చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మదనపల్లె సహా భూకబ్జాలు, అక్రమ బదలాయింపుల ఘటనలు చోటు చేసుకున్నాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భూ కబ్జాల బాధితులతో విజయవాడలో సదస్సు నిర్వహిస్తామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూ బాధితులకు న్యాయం చేయాలని రామకృష్ణ కోరారు. 

ABOUT THE AUTHOR

...view details