ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఏపీపీఎస్సీలో అవకతవకలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి: సీపీఐ రామకృష్ణ - High Court On 2018 Group1 Exam

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 15, 2024, 7:32 PM IST

CPI Ramakrishna Fires On YSRCP Government: 2018 గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష పేపర్‌ మూల్యాంకనంలో అవతవకలకు పాల్పడిన వారిపై సీబీఐ ఎంక్వైరీకి ఆదేశించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ డిమాండ్ చేశారు. ఏపీపీఎస్సీ ఉద్యోగాల భర్తీలో కోట్లాది రూపాయలు చేతులు మారాయని ఆయన ఆరోపించారు. సీఎం జగన్​ ప్రతిపక్షాలు చెప్పేది ఏదీ వినకుండా మూర్ఖంగా పోయారు కాబట్టే చివరకు హైకోర్టు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను రద్దు చేసి మళ్లీ వాటిని నిర్వహించాలని ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందని రామకృష్ణ పేర్కొన్నారు. ఇందులో ఎవరెవరు భాగస్వాములుగా ఉన్నారో వారందరినీ కఠినంగా శిక్షించాలని పేర్కొన్నారు. 

పారదర్శకంగా పరీక్షలు నిర్వహిస్తున్నామని జబ్బలు చరుచుకుంటున్న ఏపీపీఎస్సీ అభ్యర్థులకు మాత్రం చుక్కలు చూపిస్తోందని మండిపడ్డారు. ఇటీవల నిర్వహించిన గ్రూప్‌-2 ప్రిలిమ్స్‌లో కఠిన ప్రశ్నలు ఇచ్చి అభ్యర్థులను ఆందోళనలోకి నెట్టేసిందని ఆయన విమర్శించారు. పబ్లిక్​ సర్వీస్​ కమీషన్​ చైర్మన్​లు, ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులైనా సరే వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. కాగా ఈ నెల 17న జరగనున్న గ్రూప్‌-1 ప్రిలిమ్స్​ పరీక్షకు అభ్యర్థులు సన్నద్ధమవుతున్న విషయం తెలిసిందే.

ABOUT THE AUTHOR

...view details