ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఓటర్ల జాబితాలో అవకతవకలకు ఐఏఎస్​, ఐపీఎస్​లు కూడా కారణం: సీపీఐ నేత రామకృష్ణ - Votes Irregularities

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 12, 2024, 1:03 PM IST

CPI Ramakrishna Fire on CM Jagan: జగన్ రాష్ట్రానికి సీఎం అయినప్పటి నుంచి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. అనంతపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి చాలామంది ముఖ్యమంత్రులుగా పనిచేసినా ఒకవైపు పార్టీ యంత్రాంగాన్ని, మరోవైపు ప్రభుత్వ యంత్రాంగాన్ని రెండు కాళ్లకింద పెట్టుకుని తొక్కిపట్టి పరిపాలన చేసింది జగన్ ఒక్కరేనని ధ్వజమెత్తారు. 

CPI Ramakrishna Comments: రాష్ట్రానికి ఇలాంటి దుర్గతి రావటానికి ఐఏఎస్​, ఐపీఎస్​ అధికారులు కూడా కారణమేనని ఆరోపించారు. అధికారులు దిగజారి ప్రవర్తించటం వల్ల రాష్ట్రంలో ఓటర్ల అవకతవకలు(Votes Irregularities)పెరిగిపోయాయన్నారు. వైనాట్ 175 అంటున్న సీఎం జగన్​.. ఓటమి భయంతో ఎమ్మెల్యేలను బదిలీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. దీంతోపాటు రాష్ట్రంలో అరాచక పాలనకు బీజేపీ వత్తాసు పలుకుతోందని అన్నారు. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోవటంలో బీజేపీ(BJP) హస్తం ఉందని ఆరోపించిన ఆయన సర్వ అనర్థాలకు కారణం భారతీయ జనతా పార్టీ అని ధ్వజమెత్తారు.

ABOUT THE AUTHOR

...view details