LIVE: కడపలో రాహుల్‌గాంధీ పర్యటన - ఇడుపులపాయ నుంచి ప్రత్యక్ష ప్రసారం - Rahul Gandhi in Kadapa - RAHUL GANDHI IN KADAPA
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 11, 2024, 12:04 PM IST
|Updated : May 11, 2024, 12:22 PM IST
Rahul Gandhi Election Campaign: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కడపలో పర్యటిస్తున్నారు. కడపలో నిర్వహించే ఎన్నికల బహిరంగసభలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఉదయం కడప విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్ గాంధీ, అక్కడి నుంచి హెలికాప్టర్లో ఇడుపులపాయకు చేరుకున్నారు. పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో (YS SHARMILA) కలిసి కడప నుంచి హెలికాప్టర్లో ఇడుపులపాయ చేరుకున్నారు.ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్ వద్ద రాహుల్ నివాళులర్పించనున్నారు. అక్కడి నుంచి తిరిగి కడప చేరుకోనున్నారు. కాంగ్రెస్ పార్టీ బహిరంగసభలో రాహుల్ గాంధీ పాల్గొంటారు. కడప పార్లమెంటు అభ్యర్థిగా వైఎస్ షర్మిల పోటీ చేస్తున్న తరుణంలో, ఆమె గెలుపు కోసం రాహుల్ గాంధీ కడపలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. బహిరంగసభలో పాల్గొని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. కడప బిల్టప్ సర్కిల్లో నిర్వహించే కాంగ్రెస్ సభ కోసం ఇప్పటికే భారీగా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్ వద్ద నుంచి ప్రత్యక్ష ప్రసారం.
Last Updated : May 11, 2024, 12:22 PM IST