తెలంగాణ

telangana

ETV Bharat / videos

LIVE : హరే కృష్ణ హెరిటేజ్​ టవర్​ ఆధ్వర్యంలో అనంత శేష స్థాపన ఉత్సవం - cm revanth reddy live - CM REVANTH REDDY LIVE

By ETV Bharat Telangana Team

Published : Aug 25, 2024, 12:35 PM IST

Updated : Aug 25, 2024, 1:04 PM IST

CM Revanth Reddy Today Live : క్రీడా కార్యక్రమాలకే గచ్చిబౌలి స్పోర్ట్స్​ విలేజ్​ను వినియోగిస్తామని సీఎం రేవంత్​ రెడ్డి అన్నారు. పారిస్​ ఒలింపిక్స్​లో భారత్​ అంత గొప్ప ప్రదర్శన చేయలేదని అన్నారు. 2028 ఒలింపిక్స్​లో తెలంగాణ అథ్లెట్లు అత్యధిక పతకాలు సాధించేలా కృషి చేస్తున్నామని తెలిపారు. యంగ్​ ఇండియా స్పోర్ట్స్​ వర్సిటీని వచ్చే విద్యా సంవత్సరం నుంచే ప్రారంభిస్తున్నామని చెప్పారు. ఖేలో ఇండియా నిర్వహణను తెలంగాణకు ఇవ్వాలని కేంద్రానికి విన్నవించామన్నారు. 2036లో హైదరాబాద్​లో ఒలింపిక్స్​ నిర్వహించే అవకాశం ఇవ్వాలని కేంద్రాన్ని కోరామని సీఎం వివరించారు. గచ్చిబౌలి మైదానంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. అనంతరం కోకాపేట్​ అక్షయ పాత్ర ఫౌండేషన్​ సమీపంలో హరే కృష్ణ హెరిటేజ్​ టవర్ ఆధ్వర్యంలో అనంత శేష స్థాపన ఉత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్​తో పాటు మంత్రులు శ్రీధర్​ బాబు పాల్గొన్నారు. అనంతరం సీఎం రేవంత్​ రెడ్డి అక్షయపాత్ర ఫౌండేషన్​ గురించి మాట్లాడారు.
Last Updated : Aug 25, 2024, 1:04 PM IST

ABOUT THE AUTHOR

...view details