ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 24, 2024, 8:23 PM IST

Updated : Jan 24, 2024, 9:44 PM IST

ETV Bharat / videos

రేషన్ డీలర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి: రేషన్ డీలర్ల సమాఖ్య

CM Jagan Should Not Solve Ration Dealers Problems: రాష్ట్రంలో రేషన్ డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని రేషన్ డీలర్ల సమాఖ్య అధ్యక్షుడు దివి లీలామాదవరావు డిమాండ్ చేశారు. రేషన్ డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై లీలామాదవరావు  సీఎం జగన్​కు  లేఖ రాశారు. తమ సమస్యలను పరిష్కరించని పక్షంలో ఆందోళన తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. విజయవాడలో నిర్వహించిన రేషన్ డీలర్స్ సమాఖ్య రాష్ట్ర స్థాయి సమావేశంలో పలు తీర్మానాలు చేశారు.  సమాఖ్య గౌరవ సలహాదారుగా విశ్రాంత ఐఏఎస్‌ అధికారి డి.వరప్రసాద్‌ను నియమించినట్లు తెలిపారు. ఆహార భధ్రత చట్టం ప్రకారం ఆథరైజేషన్‌ పొందిన డీలర్లు మాత్రమే సరకులు పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఎండీయుల ద్వారా పంపిణీ చట్టవిరుద్ధమని దీనిపై సమీక్షించాలని కోరారు. 

Ration Dealers Meet in Vijayawada: గత ప్రభుత్వం ఇచ్చిన జీవో5 ఉత్తర్వుల ప్రకారం చనిపోయిన డీలర్లకు మట్టి ఖర్చులు, సంక్షేమ నిధి ఏర్పాటు, ఆరోగ్య కార్డులు జారీ, బీమా సౌకర్య కల్పన వంటి అంశాలపై తాము ఎన్నిసార్లు వినతి పత్రాలు ప్రభుత్వానికి అందజేసినా పట్టించుకోవడంలేదని ఆయన మండిపడ్డారు. రేషను సరఫరాను నిర్వహిస్తున్న దుకాణాలకు విద్యుత్​ సరఫరాను సైతం ప్రభుత్వం అందించాలని కోరారు. తమ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చే రాజకీయ పార్టీకే తాము మద్దతుగా నిలుస్తామని ఆయన తెలిపారు. 

Last Updated : Jan 24, 2024, 9:44 PM IST

ABOUT THE AUTHOR

...view details