ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

చంద్రబాబుతోనే రాష్ట్రం సుభిక్షం: పెన్షనర్‌ పార్టీ నేతలు - CM Jagan Neglect Pensioners - CM JAGAN NEGLECT PENSIONERS

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 26, 2024, 7:10 PM IST

CM Jagan Neglect Pensioners in AP : సీఎం జగన్​​ పెన్షన్​దారులను చిన్న చూపు చూశారని ఆంధ్రప్రదేశ్​ పెన్షనర్​ పార్టీ అధ్యక్షులు సుందర్​ రామన్​ ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు పెన్షన్​​దారులు నరకయాతన అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయిదేళ్ల వైసీపీ ప్రభుత్వం హయాంలో పెన్షన్​ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితిల్లో పెన్షన్​దారులు ఉన్నారని పేర్కొన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే చంద్రబాబుతోనే సాధ్యమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా పని చేస్తామని పెన్షనర్స్​ నేతలు తెలిపారు.

వైసీపీ ప్రభుత్వంలో సమయానికి పెన్షన్​ అందక, ఈఎంఐలు కట్టలేక అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నామని పెన్షనర్స్​ నేతలు పేర్కొన్నారు. పెన్షన్​ అందుకునే వ్యక్తికి పెన్షన్​ తప్ప మరొక ఆదాయం ఉండదని ఈ సందర్భంగా తెలియజేశారు. పెన్షన్​ లబ్ధిదారులకు కనీస గుర్తింపు ఇవ్వని జగన్​పై తమకు నమ్మకం లేదని ప్రకటించారు. రానున్న ఎన్నికల్లో జగన్​ను ఇంటింకి పంపించేందుకు మాతో పాటు రాష్ట్ర ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details