పెట్రోలు కూపన్లు తీసుకో - సీఎం బస్సు యాత్రలో రైడ్ వేసుకో! 'సిద్దం' సభకు వైసీపీ కూపన్ల ఎర - CM Jagan Bus Yatra Petrol Coupons - CM JAGAN BUS YATRA PETROL COUPONS
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 18, 2024, 8:38 PM IST
|Updated : Apr 19, 2024, 6:54 AM IST
CM Jagan Bus Yatra Petrol Coupons: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన 'మేమంతా సిద్ధం' సభకు జన స్పందన కరవైంది. వైసీపీ నేతలు జనాలకు డబ్బులు ఇచ్చి మరీ తరలిస్తున్నారు. ఒక్కొక్కరికీ 200 రూపాయలు నగదు, ద్విచక్రవాహనానికి 200 రూపాయల పెట్రోల్ కూపన్లు ఇచ్చి తరలించారు. వైసీపీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని జనాలకు డబ్బులు ఇచ్చి జగన్ బస్సు యాత్రకు తీసుకొచ్చారు. ఆ తర్వాత వారిని మినీవ్యాన్లు, ఆటోలలో ఇళ్లకు పంపించారు. సీఎం బస్సుయాత్ర జరిగే మార్గంలో వాహనాలు దారిపొడవునా నిలిచిపోవడంతో ఎండలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మరోవైపు సీఎం వైఎస్ జగన్ సిద్ధం అన్న ప్రతిసారి ప్రజలు ట్రాఫిక్‌తో యుద్దం చేయాల్సి వస్తోంది. దీనికి తోడు పచ్చగా ఉండే చెట్లు మోడువారిపోతాయి. అంతే కాకుండా ఆ చుట్టు పక్కల గ్రామాల్లో విద్యుత్ కోతలతో చీకట్లు కమ్ముకుంటాయి. మందుబాబులు చిందులు తొక్కుతున్నారు. ముఖ్యమంత్రి జగన్ ఉభయ గోదావరి జిల్లాలో నిర్వహించిన సిద్ధం బస్సు యాత్ర నేపథ్యంలో ప్రజలు ట్రాఫిక్ జాంతో ఇబ్బందులకు గురయ్యారు.