దుర్గారావు ఎక్కడ? - సీపీ కార్యాలయం వద్ద కుటుంబ సభ్యుల ఆందోళన - Durga Rao Family Protest - DURGA RAO FAMILY PROTEST
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 20, 2024, 2:26 PM IST
Durga Rao Family Protest : విజయవాడ నగరంలోని సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. సీపీ కాంతి రాణాను కలిసేందుకు వడ్డెర కుల సంఘం నేతలు పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చారు. అనుమతి లేదంటూ వారిని పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే
Singh Nagar Locals Protest at Vijayawada CP Office : సీఎం జగన్ మోహన్ రెడ్డిపై రాయి దాడి కేసులో అదుపులో తీసుకున్న వడ్డెర యువకుడు దుర్గారావు కోసం కుటుంబ సభ్యులు మరోసారి రోడ్డెక్కారు. ఐదు రోజులుగా దుర్గారావు ఎక్కడ ఉన్నారో పోలీసులు చెప్పడం లేదని, వెంటనే చూపించాలంటూ అతని భార్య, కుటుంబ సభ్యులు, వడ్డెర సంఘం నాయకులు విజయవాడ సీపీ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. తన భర్త ఆచూకీ చెప్పాలని దుర్గారావు భార్య పోలీసులను వేడుకున్నారు. అతను ఏ తప్పు చేయలేదని వాపోయారు. పోలీసుల వద్ద ఎలాంటి సాక్ష్యాలు లేనందునే అతడిని దాచిపెట్టారని ఆమె ఆరోపించారు. ఆందోళన చేస్తున్న దుర్గారావు కుటుంబ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీపీ కార్యాలయం నుంచి ఆటోలో స్టేషన్‌కి తరలించారు. ఇదే కేసులో ఇప్పటికే ఏ1 నిందితుడు సతీష్‌ను రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే.