LIVE : కలెక్టర్లతో సీఎం చంద్రబాబు సమీక్ష - ప్రత్యక్షప్రసారం - COLLECTORS MEET - COLLECTORS MEET
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 5, 2024, 10:10 AM IST
|Updated : Aug 5, 2024, 11:29 AM IST
Chandrababu Review Collectors Live : కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. వివిధ శాఖలపై సీఎం సమీక్షలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే సాయంత్రం ఎస్పీలతో శాంతి భద్రతలపై ఆయన సమీక్ష నిర్వహించనున్నారు. కలెక్టర్లను ఉద్దేశించి రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు కలెకర్లు, అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు.ఒక్కో శాఖకు సంబంధించి మూడు, నాలుగు స్లైడ్స్ మించకూడదని ఇప్పటికే అధికారులకు స్పష్టం చేశారు. అనంతరం ముందుగా వ్యవసాయ, అనుబంధ రంగాలు, అక్వా, అటవీ శాఖలపై చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించనున్నారు. తదుపరి గనులు, నీటివనరులు, పరిశ్రమలు, రవాణా, విద్యుత్, పెట్టుబడులు మౌలిక సదుపాయాల కల్పనపై సీఎం సమీక్షిస్తారు. భోజన విరామం తర్వాత పాఠశాల, ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ది, సంక్షేమ శాఖలు, పౌర సరఫరాల శాఖ, వైద్యారోగ్య, పురపాలక శాఖలపై, చివరగా రెవెన్యూ, ఎక్సైజ్ శాఖలు, శాంతి భద్రతలపై ముఖ్యమంత్రి సమీక్ష చేయనున్నారు. మరోవైపు కలెక్టర్ల సదస్సుకు పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Last Updated : Aug 5, 2024, 11:29 AM IST