ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

LIVE :కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన - ప్రత్యక్ష ప్రసారం - CM CHANDRABABU KUPPAM TOUR

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 6, 2025, 12:05 PM IST

Updated : Jan 6, 2025, 2:45 PM IST

CM Chandrababu Kuppam Tour : ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో నేటి నుంచి రెండు రోజులపాటు పర్యటించనున్నారు. సీఎం పర్యటనకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఇవాళ మధ్యాహ్నం బెంగళూరు నుంచి హెలికాఫ్టర్‌లో ద్రవిడ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకున్నారు. అక్కడ ప్రజాప్రతినిధులు, అధికారుల స్వాగతం అనంతరం యూనివర్సిటీ ఆడిటోరియం చేరుకొని కుప్పం విజన్‌-2029ని ఆవిష్కరించనున్నారు.అనంతరం నడిమూరు గ్రామానికి చేరుకొని సోలరైజేషన్‌ను ప్రారంభించి, లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. సాయంత్రం సీగలపల్లి గ్రామంలో ప్రకృతి సేద్యం చేస్తున్న రైతులతో ముచ్చటించనున్నారు. అనంతర ప్రకృతి వ్యవసాయం విజన్ డాక్యుమెంట్‌ ఆవిష్కరణ, N.O.C.L.తో MOU కుదుర్చుకునే కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. రాత్రికి కుప్పం ఆర్‌ అండ్‌ బి అతిథి గృహంలో బసచేయనున్నారు. రెండో రోజు కుప్పం టీడీపీ కార్యాలయానికి చేరుకొని జననాయకుడు సెంటర్‌ను ప్రారంభించి ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. మధ్యాహ్నం కంగుంది గ్రామం చేరుకొని శ్యామన్న విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించనున్నారు. అనంతరం కుప్పంలోని NTR స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ చేరుకొని వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ద్రవిడ యూనివర్సిటీ చేరుకొని, అకడమిక్ బిల్డింగ్‌లోని కెరీర్‌ రెడీనెస్‌ సెంటర్‌ను సీఎం ప్రారంభించనున్నారు. అనంతరం యూనివర్సిటీ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. రాత్రి ఆర్‌ అండ్‌ బి అతిథి గృహంలో బస చేయనున్నారు. 
Last Updated : Jan 6, 2025, 2:45 PM IST

ABOUT THE AUTHOR

...view details