ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

రోడ్డుపైనే కొట్టుకున్న వైఎస్సార్​సీపీ నేతలు - భయాందోళనకు గురైన స్థానికులు - Clash Between Two Groups in YSRCP - CLASH BETWEEN TWO GROUPS IN YSRCP

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 3, 2024, 7:49 PM IST

Clash Between Two Groups of YSRCP in Kadiri: ఎన్నికల అనంతరం వైెఎస్సార్​సీపీలో వర్గపోరు బయటపడుతోంది. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు దాడులకు దిగుతున్నారు. పార్టీలోని నేతలు వర్గాలుగా విడిపోయి పరస్పరం దాడులు చేసుకుంటున్నారు. తాజాగా సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకరమైన పోస్టులు చేశారనే వ్యహహారం వైఎస్సార్‌సీపీలోని రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో వైఎస్సార్‌సీపీ నేత సిద్ధారెడ్డిపై అదే పార్టీకి చెందిన మరో నేత మక్బూల్ అహ్మద్ వర్గీయుడైన అంజాద్ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేశారు. ఈ విషయంపై సిద్ధారెడ్డి వర్గీయులు అంజాద్​ను ప్రశ్నించారు. పరస్పరం వాగ్వాదానికి దిగిన రెండు వర్గాల నాయకులు పట్టణంలోని టవర్ క్లాక్ వద్ద ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. కొన్నినిమిషాల పాటు ఆ ప్రాంతంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పరస్పరం దాడులతో కోర్టు రోడ్డు గందరగోళంగా మారింది. స్థానికులు కల్పించుకొని రెండు వర్గాల వారిని అక్కడి నుంచి పంపించారు.

ABOUT THE AUTHOR

...view details