పెనుగంచిప్రోలులో ఎస్సీ, బీసీ కాలనీవాసుల మధ్య గొడవ - కత్తులతో దాడి - Tension in Penuganchiprolu - TENSION IN PENUGANCHIPROLU
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 31, 2024, 12:48 PM IST
Clash Between Between SC-BC Colony in Penuganchiprolu : ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎస్సీ, బీసీ కాలనీ వాసుల మధ్య శనివారం జరిగిన కత్తుల దాడిలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ కేసులో ఇరు వర్గాలకు చెందిన వారు ఇచ్చిన ఫిర్యాదులతో పోలీసులు పది మందిపై కేసు నమోదు చేశారు. ఇవాళ (ఆదివారం) ఉదయం ఎస్సీ కాలనీకి చెందిన యువకులు పోలీస్ స్టేషన్ (Police station) వద్ద ఆందోళనకు దిగారు.
శుక్రవారం రాత్రి తిరుపతమ్మ తిరుణాలలో చోటు చేసుకున్న స్వల్ప వివాదం దాడికి దారి తీసినట్టు తెలుస్తోంది. బీసీ కాలనీకి చెందిన కొందరు యువకులు శనివారం సాయంత్రం కత్తులు ఇతర మారణ ఆయుధాలతో ఎస్సీ కాలనీ యువకులపై దాడికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న ఎస్సీ కాలనీవాసులు బీసీ కాలనీ పై దాడికి దిగారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొస్తున్నారు.
Tension in NTR District : నందిగామ ఏసీపీ జగ్గయ్యపేట సీఐ జానకిరామ్ వందలాది మంది పోలీసులు (Police) ఆందోళనకారులను అదుపు చేసి ఇళ్లకు పంపించారు. ప్రస్తుతం ఎస్సీ, బీసీ కాలనీల్లో పోలీసుల పహారా కొనసాగుతుంది. మళ్లీ ఎటువంటి వాగ్వాదం జరగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇరు వర్గాల ప్రజలు (People) కలవకుండా ప్రశాంతమైన వాతావరణం నెలకొల్పేలా తగిన బందోబస్తు (arrangement) నిర్వహించారు.