ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

అర్ధరాత్రి వరకూ క్యూలైన్లలో ఉండి ఓటు వేయడం ప్రజాస్వామ్యం సాధించిన విజయం: నిమ్మగడ్డ రమేష్​కుమార్​ - NIMMAGADDA RAMESHKUMAR ON VOTING - NIMMAGADDA RAMESHKUMAR ON VOTING

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 14, 2024, 1:35 PM IST

CFD About Voting in Andhra Pradesh : సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు అపూర్వమైన సంకల్పం చూపించారని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఓటు హక్కు వినియోగించుకున్న వారందరికీ సీఎఫ్​డీ (CFD) తరఫున అభినందనలు తెలిపారు. అర్ధరాత్రి వరకూ క్యూలైన్లలో వేచి ఉండి ఓటు వేయడం ప్రజాస్వామ్యం సాధించిన విజయంగా అభివర్ణించారు. ముఖ్యంగా వృద్ధులు, వికలాంగులు, యువత, మహిళలు ఏకతాటిపైకి వచ్చి సరికొత్త చరిత్రను లిఖించారన్నారు. 

ఎన్నికల్లో ప్రజాస్వామిక విలువలకు మచ్చ కలిగించే హింసాత్మక చర్యలు ఇంకా జరగడం దురదృష్టకరమన్నారు. తిరుపతి, చిత్తూరులో ప్రజాస్వామ్య హక్కులను కొందరు పోలీసు అధికారులు చట్టవిరుద్ధంగా కాల రాస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో జరిగిన హింసాత్మక ఘటనలపై ఈసీ తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. దళితులు, మహిళలపై జరిగిన దాడులు పాశవికం అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల్లో ప్రజలు చూపించి కర్తవ్య దీక్ష ప్రజాస్వామ్యానికి వారు ఇచ్చిన గౌరవమని రమేశ్​కుమార్​ కొనియాడారు.  

ABOUT THE AUTHOR

...view details