ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

సీఐ జీపును ఢీకొట్టిన లారీ- తీవ్రంగా గాయపడ్డ పోలీసులు - CI Road Accident in Anantapur - CI ROAD ACCIDENT IN ANANTAPUR

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 14, 2024, 3:34 PM IST

CI Road Accident in Anantapur District : అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం గూబనపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో రాయదుర్గం రూరల్‌ సీఐ ప్రసాద్‌బాబు, హోంగార్డు శ్రీరామ్‌ తీవ్రంగా గాయపడ్డారు. రాయదుర్గంలో పోలింగ్ ముగిసిన తరువాత ఈవీఎమ్​ (EVM) లు తరలిస్తున్న ఎన్నికల అధికారులకు బందోబస్తుగా అనంతపురం వెళ్తుండగా ప్రమాదం జరిగింది. సీఐ ప్రయాణిస్తున్న జీపును గుర్తు తెలియని లారీ ఢీకొట్టి వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. క్షతగాత్రులకు మొదట కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రిలో ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం అనంతపురానికి తరలించారు.

జీపు ముందు భాగంలో పూర్తిగా దెబ్బతిని రోడ్డు పక్కన బోల్తా పడింది. ఈ ప్రమాదంలో రాయదుర్గం రూరల్ సీఐ ప్రసాద్ బాబు ప్రయాణిస్తున్న జీపును గుర్తు తెలియని లారీ ఢీ కొట్టినట్లు గుర్తించారు. కళ్యాణదుర్గం రూరల్ పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రమాదం ఎవరైనా కావాలనే చేశారా అనే అనుమానాలు సైతం ఉన్నట్లు స్థానికుల ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.

ABOUT THE AUTHOR

...view details